Balakrishna: బ్యూటిఫుల్ సాంగ్ ను వదిలిన 'రూలర్'

  • 'రూలర్'గా వచ్చేస్తున్న బాలకృష్ణ 
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ 
  • ఈ నెల 20వ తేదీన భారీ విడుదల  

బాలకృష్ణ అభిమానులంతా ఇప్పుడు 'రూలర్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు.

"యాల యాల ఇయ్యాలా డియ్యా డియ్యాలా .. ఎన్నియాల యేల జూసి ఎయ్యాలా ఉయ్యాలెయ్యాలా .. " అంటూ ఈ పాట సాగుతోంది. బాలకృష్ణ - వేదికలపై చిత్రీకరించిన ఈ పాట బీట్ పరంగాను .. కలర్ ఫుల్ గాను వుంది. లొకేషన్స్ పరంగాను .. కొరియోగ్రఫీ పరంగా మంచి మార్కులు దక్కించుకునేలానే కనిపిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన బాణీ .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి - అనూషా మణి ఆలాపన ఆకట్టుకునేలా సాగాయి.

More Telugu News