Jamia Milia Islamia: ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్ గాయాలున్నాయన్న డాక్టర్లు.. కాల్పులే జరపలేదంటున్న ఢిల్లీ పోలీసులు!

  • జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో హింస
  • బుల్లెట్ గాయాలతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నిరసనకారులు
  • వారికి తగిలినవి పెల్లెట్ గాయాలని చెప్పిన పోలీసులు

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఆందోళన కార్యక్రమం మరింత తీవ్రతరమైన నేపథ్యంలో, పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో డజన్ల కొద్దీ విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఇద్దరు జామియా నిరసనకారులు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు.

దీనిపై పోలీసులు స్పందిస్తూ, నిరసనకారులపై తాము కాల్పులు జరపలేదని చెప్పారు. వారికి తగిలినవి పెల్లెట్ గాయాలని తెలిపారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల కూడా కొందరు గాయపడ్డారని చెప్పారు.

More Telugu News