Srilanka: 28 ఏళ్లు అయినా పౌరసత్వం లేదు.. చనిపోతా అనుమతించండి: శ్రీలంక శరణార్థుడు

  • 28 ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి భారత్‌కు 
  • తమిళనాడులోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివాసం
  • పౌరసత్వ సవరణ చట్టంలో శ్రీలంక శరణార్థులను చేర్చలేదని ఆవేదన

శ్రీలంక నుంచి ఇండియాకు శరణార్థుడిగా వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా తనకు పౌరసత్వం రాలేదని యనద్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వం లేని తనను కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ సేలం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాడు. 28 ఏళ్ల క్రితం తాను శ్రీలంక నుంచి శరణార్థుడిగా ఇండియాకు వచ్చానని యనద్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తమిళనాడులోని సేలం జిల్లా పవలతనూరులోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నట్టు తెలిపాడు.

భారత పౌరసత్వం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో శ్రీలంక శరణార్థులను చేర్చలేదని యనద్ ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వం లభించని తాను చనిపోవాలని అనుకుంటున్నానని, కారుణ్య మరణానికి అనుమతించాలని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో యనద్ కోరాడు.

More Telugu News