Sarileru Neekevvaru: సరిలేరు నీకెవ్వరు నుంచి సరికొత్తగా మరో పాట... హి ఈజ్ సో క్యూట్!

  • సంక్రాంతి కానుకగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు
  • పాట రిలీజ్ చేసిన చిత్రయూనిట్
  • దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటకు శ్రీమణి సాహిత్యం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి 'హి ఈజ్ సో క్యూట్... హి ఈజ్ సో స్వీట్' అనే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇప్పటికే పలు గీతాలను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజా పాటను కూడా అభిమానుల ముందుంచింది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు.

More Telugu News