Andhra Pradesh: ఏపీ శాసనసభలో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

  • ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ
  • అనంతరం బిల్లును ఆమోదించిన సభ 
  • వైసీపీ సభ్యుల హర్షం

ఏపీలో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును సభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు, హౌస్ లో ప్రవేశపెట్టిన బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.బిల్లు ఆమోదించడంపై వైసీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు, సీఎం జగన్ మాట్లాడుతూ, మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నలభై మూడు వేల బెల్ట్ షాపులతో పాటు పర్మిట్ రూమ్ లను కూడా ఎత్తివేసినట్టు చెప్పారు. చంద్రబాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉంటే, తమ ప్రభుత్వం వాటిని 3,456కు తగ్గించిందని అన్నారు. ఇప్పటి వరకూ ఇరవై శాతానికి పైగా మద్యం షాపులు తగ్గించామని వివరించారు. అనంతరం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.

More Telugu News