Uttar Pradesh: చెట్ల నరికివేతను వినూత్న తరహాలో అడ్డుకున్న గ్రామ సర్పంచ్!

  • యూపీలో విపరీతంగా చెట్ల నరికివేత
  •  గ్రామ సర్పంచ్ కొత్త ఎత్తుగడ
  • చెట్లపై దేవుళ్ల బొమ్మలు చిత్రీకరణ

ఉత్తరప్రదేశ్ లోని నగ్వా గ్రామ పంచాయతీ సర్పంచ్ పరాగ్ దత్ మిశ్రా ఇప్పుడు జాతీయస్థాయిలో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఓ సాధారణ సర్పంచ్ పై మీడియా దృష్టి సారించిందంటే అది మామూలు విషయం కాదు. ఇంతకీ ఆయన చేసింది తన గ్రామ పరిధిలో చెట్ల నరికివేతను అడ్డుకోవడమే. గ్రామస్తులు విరివిగా చెట్ల నరికివేతకు పాల్పడుతుండడంతో పర్యావరణం దెబ్బతింటుందని మిశ్రా గ్రహించారు. కానీ నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామస్తులకు పర్యావరణం గురించి చెబితే ఏం అర్థమవుతుంది? దాంతో, ఆయన ఎంచుకున్న మార్గం ట్రీ పెయింటింగ్. అంటే, చెట్లపై బొమ్మల చిత్రీకరణ.

అవి మామూలు బొమ్మలయితే గ్రామస్తులు పెద్దగా పట్టించుకునేవాళ్లుకాదు కానీ, ఆయన చెట్లకు వేసింది దేవుళ్ల బొమ్మలు మరి. దాంతో ఆ గ్రామస్తులు చెట్లపై దేవుళ్ల చిత్రాలు చూసి భక్తిభావంతో అక్కడ్నించి తప్పుకుంటున్నారు. చెట్లను దైవాలుగా భావించి పూజలు చేసే పరిస్థితి వచ్చింది. మొత్తానికి మిశ్రా ఎత్తుగడ ఫలితాన్నిచ్చింది. ఆ విధంగా ఆయన దాదాపు వెయ్యికిపైగా చెట్లను గొడ్డలి వేటు నుంచి కాపాడగలిగారు.

More Telugu News