Jagan: సీఎం జగన్ నిర్ణయానికి మరోసారి జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

  • ఇంగ్లీషు మీడియం అంశంపై ప్రభుత్వానికి రాపాక మద్దతు
  • రాపాక వైసీపీకి దగ్గరవుతున్నారంటూ కథనాలు
  • ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు నిర్ణయానికి రాపాక హర్షం

ఇటీవల జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. రాపాక వైసీపీకి దగ్గరవుతున్నారా అనే సందేహాలు కలిగించే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని రాపాక హర్షించడం ఆసక్తి కలిగించింది. తాజాగా, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం రాపాక సమర్థించారు. సీఎం జగన్ నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. సీఎం నిర్ణయం దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని కొనియాడారు.

More Telugu News