Payal Rohatgi: బాలీవుడ్ నటి పాయల్ ను జైలుకు పంపిన కోర్టు

  • నెహ్రూ-గాంధీ కుటుంబంపై అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేసిన పాయల్
  • అహ్మదాబాద్ లో నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు
  • డిసెంబర్ 24 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన కోర్టు

నెహ్రూ-గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేసిన సినీ నటి పాయల్ రోహత్గిని రాజస్థాన్ లోని కోర్టు జైలుకు పంపింది. ఆమెకు డిసెంబర్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టి వేసింది. దీంతో, బెయిల్ కోసం మరోసారి ఆమె తరపు లాయర్ పిటిషన్ వేయబోతున్నారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నివాసంలో పాయల్ ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ యాక్టుతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు అరెస్ట్ చేయడానికి కాసేపు ముందు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'మోతీలాల్ నెహ్రూపై వీడియోను రూపొందించినందుకు రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు. గూగుల్ లో ఉన్న సమాచారం ఆధారంగానే నేను ఈ వీడియో చేశా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఒక జోక్ గా మారింది.' అని ట్వీట్ చేసింది. దీనికి తోడు ప్రధాని, కేంద్ర హోం మంత్రిలకు నమస్కారం పెడుతున్నట్టుగా  ఎమోజీని జతచేసింది.

More Telugu News