Jamia Millia Islamia: అవన్నీ వదంతులే.. ఆందోళనల్లో మా వాళ్లెవరూ ప్రాణాలు కోల్పోలేదు: జామియా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రకటన

  • ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం
  • విశ్వవిద్యాలయ క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించారు
  • వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతాం

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలతో అట్టుడుకుతోన్న ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ వర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ స్పందించారు. ఈ రోజు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.  

'మా వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వదంతులు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. మా విద్యార్థులు ఎవరూ చనిపోలేదు. ఈ ఆందోళనల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది మా విద్యార్థులే ఉన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించడంపై మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతాం. ధ్వంసమైన ఆస్తులను తిరిగి నిర్మించుకోవచ్చు. కానీ, విద్యార్థుల ఆందోళనలకు మీరు విలువ కట్టలేరు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం' అని తెలిపారు.

More Telugu News