India: హింసాత్మక ఘటనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్న విపక్షాలు

  • పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న ఆందోళనలు
  • రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన విపక్ష పార్టీలు
  • ఆందోళనలపై నివేదిక కోరలేదన్న కేంద్ర హోంశాఖ

జేఎంఐ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో చెలరేగుతోన్న హింసాత్మక ఘటనలపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, ఈ హింసాత్మక ఘటనలను వివరించాలని ఉత్తరాదిలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈ రోజు విపక్ష పార్టీలు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరాయి.

కాగా, పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న ఆందోళనలపై కేంద్ర హోం శాఖ వర్గాలు స్పందించాయి. నిన్నటి నుంచి జరుగుతోన్న ఘటనలపై ఇప్పటివరకు తాము నివేదిక కోరలేదని ఓ అధికారి మీడియాకు తెలిపారు. తాము ఈ రోజు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు.

More Telugu News