L.V. Prasad: గేటు కీపర్ గా ఎల్వీ ప్రసాద్ పనిచేసిన థియేటర్లోనే ఆయన సినిమా 175 రోజులు ఆడిందట!

  • చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం 
  • ఇంట్లో చెప్పకుండా పారిపోయిన వైనం 
  • ముంబైలో ఎన్నో ఇబ్బందులు పడిన ఎల్వీ ప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ గురించి ప్రస్తావిస్తూ .."ఎల్వీ ప్రసాద్ గారు టీనేజ్ లోనే సినిమాలపట్ల గల ఆసక్తితో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. చేతిలో డబ్బులేక .. భాష తెలియక .. తెలిసినవాళ్లు లేక అక్కడ నానా అవస్థలు పడ్డారు. సినిమా వాళ్లతో పరిచయం పెంచుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా చిన్నాచితకా పనులు చాలా చేశారు.

సినిమాల్లో చిన్నచిన్న వేషాలు కూడా చేశారు. కృష్ణా థియేటర్ గేట్ కీపర్ గా కూడా పనిచేశారు. ఆ థియేటర్ కి సినిమావాళ్లు వస్తే వాళ్ల కంట్లో పడొచ్చనే ఉద్దేశంతోనే ఆయన అక్కడ పనికి కుదిరారు. అలా ఎన్నో కష్టాలుపడి ఆయన దర్శకుడు అయ్యారు. ఆయన తీసిన 'ఖిలోన' అనే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ థియేటర్లో ఆయన గేట్ కీపర్ గా చేశారో, ఆ థియేటర్లోనే ఆ సినిమా 25 వారాలపాటు విజయవంతంగా ప్రదర్శించబడి రజతోత్సవాన్ని జరుపుకుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News