Botsa Satyanarayana: ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యం: అసెంబ్లీలో మంత్రి బొత్స

  • టీడీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానం 
  • గత ప్రభుత్వంలో ఆదరాబాదరాగా పనులు 
  • తమ విధానం వల్ల ప్రతి ఇంటిపై రూ.75 వేలు మిగులు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల ఇంటి నిర్మాణం విషయంలో ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకున్నారని, ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ విధానంలోనే ఇళ్ల నిర్మాణం జరిపితే లబ్ధిదారులు జీవితాంతం అప్పు తీర్చాల్సి ఉంటుందని చెప్పారు.

అసెంబ్లీలో ఈరోజు టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటిని కూడా పూర్తిచేసి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తాము గత లబ్దిదారులను తొలగించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని గుర్తించినందునే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్లు చెప్పారు. 

దీని వల్ల ఒక్కో ఇంటి పై రూ.75 వేలు ఆదా అవుతోందని, ఈ లెక్కన రాష్ట్రంలో నిర్మించనున్న 3 లక్షల ఇళ్లకు 2,626 కోట్లు దోపిడీ చేశారని తేలిందన్నారు. రివర్స్ టెండరింగ్' వల్ల 150 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని సభకు వివరించారు

More Telugu News