Balakrishna: బన్నీ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న బోయపాటి?

  • బాలకృష్ణకి రెండు భారీ హిట్లు ఇచ్చిన బోయపాటి 
  • మూడో సినిమాకి సన్నాహాలు 
  • టైటిల్ కోసం 'దిల్' రాజుతో చర్చలు

బాలకృష్ణ .. బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. దాంతో ఈ కాంబినేషన్లో మరో మూవీ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఈ ఇద్దరూ త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నారు.

ఈ సినిమాలోను బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా పవర్ఫుల్ గా మలిచాడట. కథను .. బాలకృష్ణ పాత్రను దృష్టిలో పెట్టుకుంటే 'ఐకాన్' అనే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని బోయపాటి భావించినట్టుగా సమాచారం. ఈ టైటిల్ 'దిల్' రాజు దగ్గర వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఆయన ఈ టైటిల్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందువలన బోయపాటి ఆ టైటిల్ కోసం 'దిల్' రాజును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

More Telugu News