Chandrababu: రాష్ట్రంలో పాలన 'రివర్స్'లో నడుస్తోంది!: చంద్రబాబు ధ్వజం

  • ప్రాజెక్టుల టెండరింగ్ లలో రిజర్వ్ విధానం 
  • నిధుల ఆదా పేరుతో సొంత వారికి కట్టబెడుతున్నారు
  •  అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం

వై.ఎస్.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాలన 'రివర్స్'లో నడుస్తోందని ఏపీ విపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని నిధుల ఆదా పేరుతో తమ సొంతవారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.


రెండు రోజుల సెలవుల అనంతరం ఈ రోజు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా టీడీపీ 'రివర్స్'పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని కోరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు.

More Telugu News