Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • భారీ చిత్రం నుంచి తప్పుకున్న కీర్తి 
  • కబడ్డీ కోచ్ లుగా గోపీచంద్, తమన్నా 
  • రీతువర్మకు తమిళంలో పెద్ద ఆఫర్

  *  మణిరత్నం రూపొందిస్తున్న భారీ చిత్రం 'పొన్నియన్ సెల్వం' నుంచి అందాలతార కీర్తి సురేశ్ తప్పుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ రావడంతో డేట్స్ సర్దుబాటు కాక మణిరత్నం చిత్రాన్ని ఈ చిన్నది వదులుకుందట.
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరూ కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు.
*  శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందే తెలుగు చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రీతువర్మ తాజాగా తమిళంలో ఓ పెద్ద అవకాశాన్ని అందుకుంది. విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె నాయికగా నటిస్తుంది. 

More Telugu News