Disha: దిశ లాంటి ఘటనలు జరగకూడదంటే ఇలా చేయాలి: పవన్ కల్యాణ్

  • బహిరంగ శిక్షలకు మద్దతు తెలిపిన పవన్
  • బహిరంగ శిక్షల్ని చట్టబద్ధం చేయాలని సూచన
  • సింగపూర్, దుబాయ్ దేశాల ప్రస్తావన

అత్యాచారాలకు సింగపూర్, దుబాయ్ తరహాలో బహిరంగ శిక్షలు విధించాలని, ఆ శిక్షలను చట్టబద్ధం చేయాలని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. చట్టబద్ధమైన రీతిలో బహిరంగ శిక్షలు విధిస్తే దాని శక్తి, ప్రభావం ప్రజలపై తప్పకుండా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు. దిశ వంటి సంఘటనలు జరగకూడదంటే ఇలాగే చేయాలంటూ పవన్ తరఫున జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

తప్పు చేసినవాడ్ని చంపేయడం, నరికేయడం అటవిక న్యాయం అవుతుందని, దానికి బదులు సింగపూర్, దుబాయ్ దేశాల్లో మాదిరి కఠినమైన బహిరంగ శిక్షల్ని చట్టబద్ధం చేయాలనేది తన వాదన అని పవన్ స్పష్టం చేశారు. ప్రజలకు తెలియని దిశలు, నిర్భయలు ఎంతోమంది ఉన్నారని, కదిరి వంటి ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నా ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించారు. అందుకే కఠినమైన శిక్షల్ని చట్టబద్ధం చేసి, బహిరంగంగా అమలు చేస్తే సమాజంపై ఆ ప్రభావం తెలుస్తుందని పేర్కొన్నారు.

More Telugu News