Rishab Pant: విమర్శకుల నోళ్లు మూయించే ఇన్నింగ్స్ ఆడిన పంత్

  • చెన్నైలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే
  • 69 బంతుల్లో 71 పరుగులు చేసిన పంత్
  • ఇటీవల విమర్శల దాడికి గురవుతున్న పంత్

వెస్టిండీస్ తో చెన్నైలో జరుగుతున్న తొలి వన్డేలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సమయోచితంగా ఆడడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. లోకేశ్ రాహుల్ (6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటైనా, ఓపెనర్ రోహిత్ శర్మ (36) ఓ మోస్తరు స్కోరుకే పెవిలియన్ చేరినా శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పంత్ టీమిండియా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

ఇటీవల కాలంలో ఫామ్ లో లేక, పరుగులు రాక తీవ్రస్థాయిలో విమర్శలకు గురవుతున్న ఈ ఢిల్లీ యువ ఆటగాడు 69 బంతుల్లో 71 పరుగులు చేశాడు. పంత్ స్కోరులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడిన పంత్ విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్ లో పొలార్డ్ విసిరిన బంతితో పంత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ప్రస్తుతం భారత్ స్కోరు 43 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు. అయ్యర్ 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. కేదార్ జాదవ్ 20, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News