Nizamabad: పసుపు బోర్డు ఏర్పాటు కన్నా మంచి నిర్ణయం కేంద్రం తీసుకుంది: బీజేపీ ఎంపీ అరవింద్

  • బోర్డుతో ఉండే అధికారాలతో పాటు సమన్వయకమిటీ
  • ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది
  • పసుపు రైతులకు ప్రతి ఏటా రూ. వంద నుంచి రెండు వందల కోట్లు 

పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసుపు బోర్డు ఏర్పాటు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పసుపు పంటకు బోర్డుతో ఉండే అధికారాలతో పాటు సమన్వయ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుందని అన్నారు.

పసుపు రైతుల కోసం ప్రతి ఏడాది వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు. రైతులకు సీడ్, ఎరువులు, అమ్మకం, కొనుగోలు, ఇన్సూరెన్స్, క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని అన్నారు. ఏపీలో పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు ప్రకటించడం లేదని, తెలంగాణ ప్రభుత్వం పసుపుకు మద్దతు ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

More Telugu News