ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

15-12-2019 Sun 12:15
  • డిసెంబరు 11న ఆసుపత్రిలో చేరిన సిద్ధరామయ్య
  • ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
  • 10-15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
అనారోగ్యానికి గురైన  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్ధరామయ్య బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. డిసెంబరు 11 నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.

'నేను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. 10-15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సూచించారు' అని సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు. యాంజియోప్లాస్టీ చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు.