Kerala: మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా...శబరిమలకు వెళ్లకండి : కె.జె.ఏసుదాసు

  • మహిళలను చూస్తే అయ్యప్పల్లో మనో చలనం కలగవచ్చు 
  • అది వారి దీక్షకు అడ్డుగా మారవచ్చు 
  • ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు సహకరించండి

కేరళలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మహిళలు వెళ్లకుండా స్వచ్ఛంద నియమాన్ని పాటించాలని వినమ్రతతో వేడుకుంటున్నానని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాసు విజ్ఞప్తి చేశారు. దీన్ని పాటించడం ద్వారా సంప్రదాయంగా వస్తున్న క్షేత్రం ప్రాశస్త్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలో నిన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

'ఒకప్పుడు అయ్యప్ప మాల ధరించేవారు ఇంట్లో స్త్రీలను కూడా చూసేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. దీక్ష తీసుకున్నవారు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇది తప్పనిసరి కావచ్చు. కానీ మహిళలు నేరుగా ఆలయానికి వెళితే భక్తుల్లో మనో చంచలనానికి కారణం కావచ్చు. వారి మనసులో చెడు భావన కలగవచ్చు. వారి దీక్ష భగ్నం కావచ్చు. అందుకే శబరిమలకు వెళ్లవద్దని వేడుకుంటున్నా. మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి సహకరించండి' అంటూ ఆయన కోరారు.

More Telugu News