Onion: రూ. 1000కి బట్టలు కొంటే, కిలో ఉల్లి ఉచితం!

  • చుక్కలను అంటుతున్న ఉల్లి ధరలు
  • మహారాష్ట్రలోని వ్యాపారి బంపరాఫర్
  • ఆఫర్ కోసం ఎగబడుతున్న కస్టమర్లు

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు చుక్కలను అంటుతున్న వేళ, తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ దుస్తుల వ్యాపారి బంపరాఫర్ ను ప్రకటించాడు. తన వద్ద రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. ఉల్లాస్ నగర్ లోని శీతల్ హ్యాండ్ లూమ్స్ యజమాని ఈ ఆఫర్ ను పెట్టాడు. "ఉల్లిపాయల ధర కిలోకు రూ. 130కి చేరుకుంది. ఇవాళ కూడా ధర పెరిగింది. దీంతో రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, ఉల్లిపాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఎంతో మంది ఈ ఆఫర్ ను ఇష్టపడుతున్నారు" అని షాపు యజమాని వ్యాఖ్యానించారు.

కాగా, గత సంవత్సరం ఇదే సమయంలో రూ. 20 వరకూ ఉన్న కిలో ధర, ఇప్పుడు రూ. 100ను దాటేసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నా, అవి ప్రజల అవసరాలను అరకొరగానే తీరుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ లో ఉల్లిపంట 22 శాతం మేరకు తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రావ్ సాహెబ్ దాన్వే వెల్లడించారు.

More Telugu News