Hyderabad: 1000 సిటీ బస్సుల రద్దు నేపథ్యంలో... హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాల్లో మార్పు!

  • సిటీ బస్సులను రద్దు చేస్తున్న టీఎస్ఆర్టీసీ
  • ఇక చివరి మెట్రో 11 గంటలకు
  • 11.50కి గమ్యాన్ని చేరుతుందన్న ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో దాదాపు 1000 ఆర్టీసీ బస్సులను టీఎస్ఆర్టీసీ రద్దు చేస్తున్న నేపథ్యంలో, మెట్రో రైలు వేళలను సవరించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఇకపై రాత్రి 11 గంటలకు మెట్రో చివరి రైలు బయలుదేరుతుందని, 11.50 గంటలకు ఆఖరి స్టేషన్ కు రైలు చేరుతుందన్న శుభవార్తను ఆయన ప్రయాణికులకు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు తొలి రైలు కదులుతుండగా, ఆ సమయాన్ని 6.30కి మార్చినట్టు తెలిపారు. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే వారికి సౌకర్యంగా ఉండేందుకే సమయాన్ని పెంచినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

More Telugu News