ఇప్పటికీ అందని కోడెల పోస్టుమార్టం రిపోర్ట్!

15-12-2019 Sun 06:30
  • సెప్టెంబర్ 16న మరణించిన కోడెల
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్
  • పోస్టుమార్టం నివేదికే కీలకమన్న ఏసీపీ కేఎస్ రావు

సెప్టెంబర్ 16వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మరణానికి సంబంధించి, ఇంతవరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా తమ చేతికి రాలేదని కేసు విచారణ అధికారిగా ఉన్న బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు వెల్లడించారు. ఈ కేసులో మరింత స్పష్టత రావడానికి పోస్టుమార్టం నివేదిక కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పటికే కోడెల కుటుంబ సభ్యులను విచారించామని, ఆయన వాడిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కోడెల మరణించిన రోజున, ఘటనా స్థలంలో సేకరించిన వస్తువులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపామని అన్నారు. కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.