Uppal: ఉప్పల్ భూమికి గతంలో ఎన్నడూ లేనంత ధర... రూ. 77 వేల వరకూ పలికిన గజం భూమి ధర!

  • ఉప్పల్ లో ఖాళీ ప్రభుత్వ ప్లాట్ల వేలం
  • భారీ స్పందనతో హెచ్ఎండీఏకు ఆదాయం
  • 33 వేల గజాలకు రూ. 172 కోట్లు

హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ లో ప్రభుత్వ భూమికి ఎన్నడూ లేనంత ధర పలికింది. హెచ్ఎండీయే అధికారులు ఖాళీగా ఉన్న జాగాలను వేలం వేయగా, అత్యధికంగా గజానికి రూ. 77 వేల ధర పలకడం గమనార్హం. మొత్తం 58 ప్లాట్లను అధికారులు వేలం వేయగా, రూ. 172.27 కోట్లకు పైగా ఆదాయం లభించింది.

1302 నంబర్ గల ప్లాట్ లో 166 చదరపు గజాల స్థలం ఉండగా, గజానికి రూ. 77 వేల ధర పలికింది. 105వ ప్లాట్ నంబర్ లో 822 చదరపు గజాల స్థలం ఉండగా, గజానికి రూ. 76,600 ధరల పలికింది. ఉప్పల్ భగాయత్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఒకే రోజున మొదటి సెషన్‌లో 6,623 గజాలు, రెండో సెషన్‌లో 32,821 గజాల్లో ఉన్న 58 ప్లాట్లను వేలం వేసినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News