దిశ ఘటనపై తెలంగాణ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

14-12-2019 Sat 21:09
  • దిశ ఎన్ కౌంటర్ పై స్పందన
  • చంపడం సమస్యకు పరిష్కారం కాదన్న ఈటల
  • సమాజంలో మార్పు రావాలంటూ వ్యాఖ్యలు

చంపడం, ఉరిశిక్షలు వేయడంతో సమస్యలు పరిష్కారం కావని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్  దిశ ఘటన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. టెక్నాలజీ లోక కల్యాణం కోసం ఉపయోగపడాలి కానీ, అదే జీవితాన్ని విధ్వంసం చేస్తుందని మనిషి ఊహించలేకపోయాడని వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో కంచే చేను మేసినట్టుగా కన్నతండ్రులే తమ పిల్లలపై క్రూరమృగాల్లా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు, టీవీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం మనిషి సుఖమయ జీవనానికి ఉపయోగపడేలా ఉండాలని అభిలషించారు. అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.