ఏపీకి చెందిన మూడు సంస్థలకు జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలు

14-12-2019 Sat 20:35
  • ఢిల్లీలో జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలు- 2019 పురస్కారాలు అందజేత
  • పురస్కారాలు అందుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ, గ్రాన్యూల్ ఓమ్ని కెమికల్స్
  •  విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ కు కూడా పురస్కారం

కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి గాను జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలను ప్రదానం చేసింది. ఇంధన పొదుపులో ప్రతిభ చూపిన రాష్ట్రాలు, సంస్థలకు పురస్కారాలను అందించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ ఈ పురస్కారాలను విజేతలకు అందించారు.

ఇంధనాన్ని ఆదా చేయడంలో అత్యుత్తమ పనితీరును చాటిన విశాఖ ఉక్కు పరిశ్రమ, గ్రాన్యూల్ ఓమ్ని కెమికల్స్ కు పురస్కారాలు దక్కాయి. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ కూడా పురస్కారాలు అందుకొనున్న జాబితాలో ఉంది. మరోవైపు ఇంధన పొదుపుపై దేశవ్యాప్తంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతిని త్రిపురకు చెందిన విద్యార్థిని అందుకుంది.