New Delhi: విద్యార్థులు నాపై మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు: ఢిల్లీ జేఎన్యూ వీసీ మామిడాల జగదీశ్ కుమార్ ఆరోపణ

  • ఢిల్లీ జేఎన్యూలో హాస్టల్ ఫీజుల పెంపు
  • విద్యార్థుల ఆగ్రహం
  • దిగిరాని అధికార వర్గం

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చెలరేగిన హాస్టల్ చార్జీల పెంపు నిరసన సెగలు ఇప్పటికీ చల్లారలేదు. హాస్టల్ ఫీజును రూ.2500 నుంచి రూ.7500కి పెంచడంతో విద్యార్థులు భగ్గుమంటున్నారు. వర్శిటీ క్యాంపస్ నిత్యం నిరసన జ్వాలలతో రగులుతోంది. దీనికంతటికీ కారకుడు జేఎన్యూ వైస్ చాన్సలర్ మామిడాల జగదీశ్ కుమార్ అని భావిస్తున్న విద్యార్థులు ఆయన పేరు చెబితేనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. వారితో చర్చలకు ఆయన ముందుకు రాకపోవడమే వారి కోపానికి కారణం.

ఈ నేపథ్యంలో, తనపై 15 నుంచి 20 మంది విద్యార్థులు ఇవాళ దాడికి ప్రయత్నించారని, భద్రతా సిబ్బంది రావడంతో బతికిపోయానని వీసీ మామిడాల జగదీశ్ కుమార్ ఆరోపించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆయన కారులో విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళుతుండగా విద్యార్థులు అడ్డుకోవడం ఆ వీడియోలో కనిపించింది.

More Telugu News