Balakrishna: బాలకృష్ణ రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఫొటోలు చూడండి!

  • ఎంజీఎం గ్రౌండ్స్ లో ఈవెంట్
  • హాజరైన బాలయ్య తదితరులు
  • డిసెంబరు 20న సినిమా రిలీజ్

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రూలర్. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ వుడా పార్క్ లోని ఎంజీఎం గ్రౌండ్స్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక, ఇతర చిత్రయూనిట్ సభ్యులు విచ్చేశారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత అంబికా కృష్ణ తదితరులు ఈ ప్రీరిలీజ్ ఉత్సవానికి హాజరయ్యారు. రూలర్ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News