రేపు మధ్యాహ్నం చెన్నైలో గొల్లపూడి అంత్యక్రియలు

14-12-2019 Sat 16:00
  • గురువారం కన్నుమూసిన గొల్లపూడి
  • కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడిన గొల్లపూడి
  • శారదాంబల్ లోని నివాసానికి భౌతికకాయం తరలింపు

సుప్రసిద్ధ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం చెన్నైలో నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడిన గొల్లపూడి చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని చెన్నై శారదాంబల్ లోని నివాసానికి తరలించారు. సాయంత్రం నుంచి  కడసారి చూపులకు అభిమానులను అనుమతించనున్నారు.