Viral Videos: జార్జియాలో లైవ్ లో మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి పారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్!

  • షాక్ అయిన జర్నలిస్టు
  • జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఘటన
  • ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమన్న పోలీసులు

ఓ బ్రిడ్జి వద్ద జరుగుతోన్న కార్యక్రమ విశేషాలను ఓ మహిళా జర్నలిస్టు లైవ్ లో చెబుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా 'రన్ ర్యాలీ' ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న పలువురు టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో ఓ మహిళా జర్నలిస్టు వెనుక నుంచి 'హాయ్' చెబుతూ వెళ్లారు.

ఓ వ్యక్తి మాత్రం ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్ ను కొనసాగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చర్యకు పాల్పిన వ్యక్తిని థామస్ కల్లావె(43) గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలను తాము ఉపేక్షించబోమని పోలీసులు తెలిపారు.

నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ పై థామస్ పాల్పడిన ఈ చర్యకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు.

More Telugu News