Onion: పెళ్లి పందిరిలో ఉల్లి, వెల్లుల్లి దండలు మార్చుకున్న వరుడు, వధువు

  • ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఘటన
  • పెరుగుతోన్న ధరలపై నిరసన
  • ఉల్లిపాయలను గిఫ్టులుగా ఇచ్చిన  అతిథులు

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై వరుడు, వధువు పెళ్లి పందిరిలోనే వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో చోటు చేసుకుంది. పెళ్లిలో పూలదండలు మార్చుకోవడం సాధారణమే. అయితే, తమ పెళ్లిలో పూలదండలతో పాటు ఈ వరుడు, వధువు ఉల్లి, వెల్లుల్లి దండలు మార్చుకున్నారు.    అంతేకాదు, ఈ పెళ్లికి వచ్చిన అతిథులు ఈ జంటకు ఉల్లిపాయలనే గిఫ్టులుగా ఇచ్చారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పాటిల్ స్పందిస్తూ... 'గత నెల నుంచి ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఉల్లిని ప్రజలు బంగారాన్ని చూసినట్లు చూస్తున్నారు. అందుకే ఈ పెళ్లిలో వరుడు, వధువు ఈ దండలను మార్చుకున్నారు. ఉల్లి ధరలు కిలోకి రూ.120కు చేరాయి' అన్నారు.

ఉల్లి ధరలపై నిరసన తెలిపేందుకే ఈ జంట వినూత్న రీతిలో ఇలా దండలు మార్చుకుందని సమాజ్ వాదీ పార్టీ నేత సత్య ప్రకాశ్ అన్నారు. ధరల పెరుగుదలపై తమ పార్టీ కూడా వినూత్న రీతిలో నిరసనలు తెలిపిందని గుర్తు చేశారు.

More Telugu News