Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • బిజీబిజీగా వున్న రాశిఖన్నా
  • దుబాయ్ లో నితిన్ వివాహం 
  • హైదరాబాదులో అజిత్ షూటింగ్

  *  కథానాయిక రాశిఖన్నా ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా వుంది. నిన్నటి వరకు 'వెంకీమామ' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ చిన్నది, ఇప్పుడు వచ్చే వారం రిలీజ్ కానున్న 'ప్రతి రోజూ పండగే' చిత్రం ప్రమోషన్ కోసం బిజీ అవుతోంది. పలు టీవీ, ప్రింట్, వెబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా వుంది. 
*  యంగ్ హీరో నితిన్ వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ వివాహం దుబాయ్ లో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నితిన్ వివాహం చేసుకుంటున్నాడు.
*  తమిళ నటుడు అజిత్ హీరోగా వీహెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాలిమై' చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. యాక్షన్ తో కూడిన పలు చేజింగ్ దృశ్యాలను ఈ షెడ్యూలులో చిత్రీకరిస్తున్నారు. 

More Telugu News