Apsrtc: ఏపీఎస్సార్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కంటే డీజిల్ బస్సులే మేలు.. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ సిఫారసులు

  • ప్రస్తుతం ఈ బస్సుల అవసరం లేదు
  • వీటి సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది
  • లీజ్ ప్రాతిపదికన తీసుకోవడం సరికాదు

ఏపీ ఎస్సార్టీసీలో అద్దె ప్రాతిపదికన 350 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని అనుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రభుత్వానికి జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ సిఫారసులు చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల కంటే డీజిల్ బస్సులే మేలని, ప్రస్తుతం వీటి అవసరం లేదని తన నివేదికలో పేర్కొంది.

ఎలక్ట్రిక్ బస్సుల సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో లేవని, వీటి సాంకేతికత పెరిగి బస్సుల ఉత్పత్తి పెరిగితే వాటి ధరలు బాగా తగ్గుతాయన్న విషయంతో పాటు ఈ బస్సులకు సంబంధించిన టెండర్లపై పలు అభ్యంతరాలు ఉన్నాయని, లీజ్ ప్రాతిపదికన తీసుకోవడం సరికాదని ఈ నివేదికలో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు పేర్కొన్నారు. 

More Telugu News