Sania Mirza: సానియా మీర్జా సోదరి పెళ్లి రిసెప్షన్ లో రామ్ చరణ్, ఉపాసన జోడీ సందడి

  • అజహర్ తనయుడితో సానియా చెల్లి పెళ్లి
  • హైదరాబాద్ లో రిసెప్షన్
  • హాజరైన ప్రముఖులు

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్ ల వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి రిసెప్షన్ గురువారం శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన కూడా ఈ విందుకు హాజరయ్యారు. సానియా మిత్రబృందంలో రామ్ చరణ్, ఉపాసన కూడా ఉన్నారు. వీరు ఎప్పటినుంచే స్నేహితులు. ఈ నేపథ్యంలో సానియా చెల్లిలి పెళ్లి విందులో చరణ్, ఉపాసన సందడి చేశారు. అజహరుద్దీన్ తోనూ చరణ్ దంపతులు ఎంతో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.

More Telugu News