Stock Markets: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న సంకేతాలతో మదుపుదార్లలో జోష్
  • 428 పాయింట్లు పెరిగి 41,009.71 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 12,086.70 వద్ద ముగింపు

దేశీయంగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ సానుకూల సంకేతాలు, కేంద్ర ఆర్థికమంత్రి నెమ్మదించిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న ఆశావహ పరిస్థితుల నేపథ్యంలో.. మదుపు దారులు కొనుగోళ్ల కెగబడటంతో మార్కెట్లు ఉరకలెత్తాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజీ  సూచీ సెన్సెక్స్ ఏకంగా 428 పాయింట్లు పెరిగి 41,009.71 వద్ద, జాతీయ స్టాక్ ఎక్చేంజీ సూచి నిఫ్టీ 115 పాయింట్లు ఎగబాకి 12,086.70 వద్ద ముగిశాయి.

ఉదయం 250 పాయింట్లను మించిన లాభంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ సాయంత్రవరకు అదే జోరుతో సాగింది. ఫార్మాకంపెనీల షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఈ రోజు లాభాలతో ముందుకు సాగాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 70.78గా కొనసాగుతోంది.

More Telugu News