Tollywood: ఆ వదంతులు నమ్మొద్దు.. నేనే చెబుతాను: హీరోయిన్ కాజల్

  • కాజల్ కు ‘పెళ్లి’ అంటూ వదంతులు
  • అవన్నీ అబద్ధాలే
  • నా పెళ్లి గురించి నేనే తెలియజేస్తా

సినీ తారలపై ‘పెళ్లి’ వదంతులు రావడం, వాటిని వారు ఖండిస్తుండడం పరిపాటే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అందాల చందమామ సినీ నటి కాజల్ అగర్వాల్ పైనా అవే తరహా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రోజు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసింది.

అవన్నీ వదంతులనీ, అవి అబద్ధాలే అని కొట్టిపారేసింది. వీటిని నమ్మొద్దని, తన పెళ్లి గురించి తానే తెలియజేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా పలు భాషల్లో తాను నటిస్తున్న చిత్రాల గురించి చెప్పింది. ఏదైనా తెలుగు సినిమాలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ, కథలు వింటున్నానని, నచ్చితే ఓకే చేస్తానని తెలిపింది.

More Telugu News