కొడాలి నానిని ఎర్రగడ్డ తీసుకెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది: అచ్చెన్నాయుడు

13-12-2019 Fri 15:36
  • వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
  • మీరు చేసిన తప్పులు ఎత్తిచూపడం నా తప్పా?
  • డిప్యూటీ సీఎం ఎస్టీ కాదు

మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కొడాలి నానిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేయకపోతే మనకు చాలా ప్రమాదం జరుగుతుందని సెటైర్లు విసిరారు. వైసీపీ నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తనపై ఏవైనా కేసులు ఉంటే కనుక చర్యలు తీసుకోవాలని తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తాను గట్టిగా మాట్లాడతానే తప్ప, అభ్యంతరకర పదజాలం ఎప్పుడూ వినియోగించలేదని అన్నారు.

కొత్తగా ఎన్నికైన పలాస శాసనసభ్యుడికి వెనుకాముందూ ఏం తెలియడం లేదని, కొద్ది రోజుల్లో ‘మీ సంగతి అంతా’ తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారపక్ష సభ్యుల నోటి వెంట తన పేరు తప్ప మరొకటి రావడం లేదని, ‘మీరు చేసిన తప్పులు ఎత్తిచూపడం నా తప్పా? అసెంబ్లీలో మాట్లాడటం నా తప్పా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం చాలా తప్పు మాట్లాడారని, ఆమె ఎస్టీ కాదని, ఎస్టీ సర్టిఫికెట్ పై ఎమ్మెల్యే అయ్యారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడుతుంటే ఏమనాలి? అని ప్రశ్నించారు.