ఏపీలో తన కుమార్తె పేరిట చట్టం తీసుకువస్తుండడంపై దిశ తండ్రి స్పందన

13-12-2019 Fri 15:29
  • ఏపీలో దిశ చట్టం
  • ఆమోదం తెలిపిన శాసనసభ
  • హర్షం వ్యక్తం చేసిన దిశ తండ్రి
  • సీఎం జగన్ కు ధన్యవాదాలు

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేలా బలమైన చట్టం తీసుకువచ్చే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దిశ యాక్ట్ ను రూపొందించింది. దిశ చట్టం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా, తన కుమార్తె పేరిట ఏపీ సర్కారు తీసుకువచ్చిన చట్టంపై దిశ తండ్రి స్పందించారు. దిశ చట్టం తీసుకువరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం జగన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. అయితే ఈ చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.