Chiranjeevi: ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ చితాల్రపై ‘మెగా’ కాంపిటీషన్‌

  • రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో ఏది నచ్చింది?
  • ఏ చిత్రంలోని పాత్ర మనసుకు దగ్గరైంది?
  • విశ్లేషణాత్మక వ్యాసం రాసి ఈ నెల 20 లోపు పంపాలి 
  • అఖిల భారత చిరంజీవి యువత ప్రకటన

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చిత్రాలపై మెగా కాంపిటీషన్‌ని నిర్వహిస్తున్నట్టు అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ రామ్ చరణ్ నటించిన 13 చిత్రాలు విడుదలయ్యాయని, ఈ చిత్రాల్లో ఏది బాగా నచ్చింది? ఏ చిత్రంలోని పాత్ర మనసుకు దగ్గరైందో విశ్లేషణాత్మకంగా విశదీకరిస్తూ మెగా అభిమానులు తమ అభిప్రాయాల్ని వ్యాస రూపంలో వెల్లడించాలని తెలిపింది. అదేవిధంగా, రామ్ చరణ్ లోని నటనా శక్తిని ఏ దర్శకుడు ఏ స్థాయిలో ఆవిష్కరించగలిగారో కూడా ఆ వ్యాసంలో వివరించాలని తెలిపింది.

మెగా అభిమానులు తమ విశ్లేషణాత్మక కథనాలను ఈ నెల 20వ తేదీలోగా హైదరాబాద్‌లోని CCT కార్యాలయానికి పంపాలని లేదా ramcharanbirthday@yahoo.comకు మెయిల్ చేయాలని కోరారు. ఈ కాంపిటీషన్‌లో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ రచనల ద్వారా సలహాలు, సూచనలు, విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది.

ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపింది. ఉత్తమ రచనలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేయనున్నట్టు వివరించింది.

More Telugu News