Andhra Pradesh: 'ఏపీ దిశ' బిల్లుకు శాసనసభ ఆమోదం

  • బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ 
  • అంతకుముందు, బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి
  • ఈ బిల్లుపై కొనసాగిన సుదీర్ఘ చర్చ

మహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్టుకు శాసనసభ ఆమోదం లభించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.

కాగా, కొత్త చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు వారం రోజుల్లోగా దర్యాప్తు,14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు చేపట్టనున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.  

More Telugu News