స్పీకర్ చైర్ లో ఆసీనులై సభను నడిపిస్తున్న అంబటి రాంబాబు!

13-12-2019 Fri 12:47
  • బయటకు వెళ్లిన తమ్మినేని సీతారాం
  • అందుబాటులో లేని ఉప సభాపతి కోన రఘుపతి
  • అంబటికి సభ నడిపించే బాధ్యత అప్పగింత

ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీలో 'ఏపీ దిశ యాక్ట్' బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా, ఆ సమయంలో ఉప సభాపతి కోన రఘుపతి కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తాను కుర్చీలో నుంచి లేచే ముందు తమ్మినేని, సభను నడిపించే బాధ్యతలను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు అప్పగించారు. ఆపై అంబటి, చైర్ లో కూర్చుని దిశ బిల్లుపై చర్చను కొనసాగించారు. సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని వేళ, సభ్యుల్లో ఒకరు తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు తీసుకుని సభను కొనసాగిస్తారన్న సంగతి తెలిసిందే.