ప్రాణం తీసిన లాటరీ.. ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య

13-12-2019 Fri 10:48
  • తమిళనాడులోని విల్లుపురంలో ఘటన
  • భార్య, ముగ్గురు పిల్లలకు సైనైడ్ ఇచ్చిన భర్త  
  • ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వైనం

ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని విల్లుపురం, సిద్ధేరి సమీపంలోని సలామత్ లో చోటు చేసుకుంది. ఆన్ లైన్ లాటరీ టికెట్లు కొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే ఇందుకు కారణం. అరుల్ అనే ఆభరణాల వ్యాపారి లాటరీ టికెట్లు కొనేవాడు. డబ్బంతా వాటికే ఖర్చు చేస్తుండడంతో అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన భార్య, ముగ్గురు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తానూ దాన్ని తాగడంతో వారందరూ మృతి చెందారు. అంతేకాదు, అతడు ఈ ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి, కొందరికి షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వెంటనే కొంత మంది అరుల్ ఇంటికి చేరుకుని, అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలకి ప్రవేశించారు. అయితే, అప్పటికే ఐదుగురు మృతి చెందారు.