జగన్ తో ఇలా సెల్ఫీ దిగిన రోజా... అలా వచ్చిన ఫొటో!

13-12-2019 Fri 09:22
  • జగన్ ను అభినందించిన మహిళా ప్రజా ప్రతినిధులు
  • ఏపీ దిశ చట్టంపై ఆనందం
  • సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రోజా

'ఏపీ దిశ యాక్ట్‌' పేరిట మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్న సందర్భంగా, కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న మహిళా ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారంతా జగన్ కు రాఖీలు కట్టారు. సీఎం చాంబర్‌ కు వెళ్లిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోమ్ మంత్రి సుచరితలతో పాటు తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రోజా, తన స్మార్ట్ ఫోన్ లో జగన్, ఇతర మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి సెల్ఫీ దిగారు. రోజా సెల్ఫీ తీస్తుండగా, అక్కడే ఉన్న అధికార ఫోటోగ్రాఫర్, ఆ చిత్రాన్ని బంధించాడు. ఇక తాను తీసుకున్న సెల్ఫీని రోజా, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ రెండు చిత్రాలను మీరూ చూడవచ్చు.