Nigeria: నైజర్ లో ఉగ్రవాదుల భీకర దాడి... 71 మంది సైనికుల దుర్మరణం!

  • పశ్చిమ నైజర్ మిలిటరీ బేస్ పై దాడి
  • 12 మందికి తీవ్రగాయాలు
  • 2017 తరువాత అతిపెద్ద దాడి

నైజర్ దేశంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మీ స్థావరంపై దాడి చేసి, 71 మంది సైనికులను పొట్టన బెట్టుకున్నారు. పశ్చిమ నైజర్ ప్రాంతంలోని మిలిటరీ బేస్ పై ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. ఘటనా స్థలిలో పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. ఎటు చూసినా మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి.

కాగా, అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ గ్రూపులకు సంబంధించిన ఉగ్రవాదులు ఈ దాడి చేసుండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ హై రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొనేందుకు చాలా మంది ఉగ్రవాదులు వచ్చారని, ఎంత మంది పాల్గొన్నారన్న విషయమై ఆరా తీస్తున్నామని నైజర్ రక్షణ మంత్రి ఇసౌఫూ కటాంబే వ్యాఖ్యానించారు. అక్టోబర్ 2017లో టాంగో టాంగో ప్రాంతంలో జీహాదీలు దాడి చేసి, తొమ్మిది మంది యూఎస్, నైజర్ సైనికులను చంపేసిన తరువాత, జరిగిన మరో పెద్ద దాడి ఇదే!

More Telugu News