Janasena: ఎంత మంది కాలగర్భంలో కలిసిపోలేదు.. మీరెంత?: వైసీపీపై పవన్ ఫైర్

  • వైసీపీ నేతలకు పద్ధతీ పాడూ లేదు
  • నోరు తెరిస్తే ‘తిట్లు’ మాట్లాడుతున్నారు
  • ఎవరికి రావు తిట్లు?

ఎంత మంది కాలగర్భంలో కలిసిపోలేదు, మీరు ఎంత? అంటూ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తాను ఏరోజూ కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని అన్నారు.

వైసీపీ నేతలకు పద్ధతీ పాడూ లేదని, నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా, నోరు తెరిస్తే ‘తిట్లు’ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరికి రావు తిట్లు? మేమందరం జర్మన్ మీడియంలో, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నామా? మేము తెలుగు మీడియంలో చదువుకో లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు? నేను వీధిబడిలో చదువుకున్నాను. నా భాష ఎలా ఉంటుందో తెలుసుగా’ అని అన్నారు.

ఆ తిట్టే వాళ్లెవరో ఉన్నారుగా..వాళ్లకేనా తిట్లు మాకు రావా? పద్ధతి కాదు కదా. బాహాబాహి తేల్చుకుందామంటే, నేను సిద్ధం. ప్రాణాల మీద నాకు ఆశ లేదు.  ధర్మం మీద బలమైన నమ్మకం ఉన్నవాడిని. గొడవలు పెట్టుకుంటాను ఎప్పుడంటే, సామ దాన భేద.. మొత్తం పూర్తయిపోవాలి. సహనాన్ని పరీక్షించుకుంటాం..తిడితే భరిస్తాం. మీరు ‘ఛీ’ కొట్టినా భరిస్తాం. కానీ, ఒకరోజు మాదొస్తుంది.. మీరందరూ భస్మీపటలం అయిపోతారు’ అంటూ వైసీపీని ఘాటుగా హెచ్చరించారు.

More Telugu News