సెట్స్ పైకి వెళ్లిన భారీ చారిత్రక చిత్రం

12-12-2019 Thu 18:13
  • మణిరత్నం నుంచి చారిత్రక చిత్రం 
  • థాయ్ లాండ్ లో తొలి షెడ్యూల్ 
  • 40 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ 

విభిన్నమైన కథలను ఎంచుకోవడం .. సహజత్వానికి దగ్గరగా పాత్రలను మలచడం మణిరత్నం ప్రత్యేకత. అలాంటి మణిరత్నం ఈ సారి చారిత్రక నేపథ్యంతో కూడిన కథను ఎంచుకున్నారు. చోళరాజుల కాలానికి సంబంధించిన కథా వస్తువును ఆయన సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాకి 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

విక్రమ్ .. కార్తీ .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్న ఆయన, తొలి షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో ప్లాన్ చేసుకున్నారు. వారం రోజుల క్రితమే థాయ్ లాండ్ చేరుకున్న ఈ సినిమా టీమ్, ఈ రోజున రెగ్యులర్ షూటింగును ఆరంభించినట్టు సమాచారం. 40 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.