Disha case accused persons Encounter: సుప్రీంకోర్టు స్టే విధించింది.. దీనిపై నిర్ణయం తీసుకోలేం: ఎన్ కౌంటర్ మృతదేహాలపై హైకోర్టు

  • ఎన్ కౌంటర్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్ జనరల్ కు ఆదేశం
  • కేసు తదుపరి విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా

దిశపై హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నిందితుల మృతదేహాల అప్పగింతపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టే విధించిందని.. ఈ నేపథ్యంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తదుపరి విచారణను కోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.

గత నెలలలో వెటర్నరీ వైద్యురాలు దిశపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి ఆమెను పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టు ఆదేశం ప్రకారం రిమాండ్ కు తరలించారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడికి దిగిన సమయంలో, జరిగిన ఎన్ కౌంటర్లో నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.


More Telugu News