Ayodhya issue case verdict: అయోధ్యపై రివ్యూ పిటిషన్ల తిరస్కరణ.. 'నవంబర్ 9' నాటి తీర్పే ఫైనల్ అన్న సుప్రీంకోర్టు

  • తీర్పును సవాల్ చేస్తూ..దాఖలైన 18 పిటిషన్ల తిరస్కరణ
  • సీజే జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయం 
  • పిటిషన్లపై  సీజే ఛాంబర్ లో అంతర్గత విచారణ  జరిపిన ధర్మాసనం

అయోధ్య తీర్పుపై దాఖలైన పలు రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 18 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అయోధ్య వివాదంపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే చివరిదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఛాంబర్ లో అంతర్గతంగా విచారణ జరిపిన అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటించింది.

అయోధ్య వివాదంపై గత నెల 9న అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణంకోసం రామ్ లల్లా కు అప్పగించాలని పేర్కొంది. మరోవైపు సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 2న తొలి పిటిషన్ దాఖలు కాగా, అనంతరం మరో 17 పిటిషన్లు దాఖలయ్యాయి.  

More Telugu News