Sensex: బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 169 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 62 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతం వరకు లాభపడ్డ టాటా మోటార్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్ల అండతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 40,582కి పెరిగింది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 11,972 వద్ద స్థిరపడింది. ఈరోజు టెలికాం, టెక్, ఐటీ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (6.99%), యస్ బ్యాంక్ (5.72%), వేదాంత లిమిటెడ్ (3.68%), టాటా స్టీల్ (3.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.85%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.64%), టీసీఎస్ (-1.87%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.51%), ఓఎన్జీసీ (-1.48%), భారతి ఎయిర్ టెల్ (-1.02%).

More Telugu News