Aam Adhmi Party: అసెంబ్లీ ఎన్నికలకోసం నిధుల వేటలో ఆమ్ ఆద్మీ పార్టీ

  • ప్రజలకు విందులిచ్చి విరాళాలు రాబట్టేందుకు వ్యూహం
  • ఈ నెల చివరి వారంనుంచి చేపట్టనున్న డిన్నర్ పార్టీలు
  • ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రచారం ప్రారంభించిన పార్టీ నేతలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధమవుతోంది. ప్రస్తుత అసెంబ్లీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకోసం నిధుల వేటలో పడింది. నిధుల సమీకరణకు గాను ఆప్ పార్టీ ప్రజలను ఆశ్రయిస్తోంది. ప్రజలకు టీ, లంచ్, డిన్నర్ పార్టీలు ఇవ్వాలని పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు సూచన చేశారు.

ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నేతృత్వంలో సాగిన ఈ సమావేశంలో  డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, మంత్రులు పాల్గొన్నారు. ‘ప్రజలకు పార్టీలిస్తూ.. వారినుంచి విరాళాల రూపంలో నిధుల సేకరణ చేపట్టాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యక్రమాలను చేపట్టాలి’ అని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం పార్టీ ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నవంబర్ లో ప్రారంభమైన ఈ ప్రచారం 24న ముగియనుంది.

More Telugu News